శివాజీ 3డి లో చూసి రజినికాంత్ ఆశ్చర్యపోయారు : గుహన్


మన సౌత్ సినిమాలని 3డి లో చూసే రోజు మరెంతో దూరంలో లేదు. ప్రస్తుతం మన దగ్గర 3డి సినిమాలకు సరిపడా ఎక్విప్ మెంట్ లేకపోవడంతో 3డి సినిమాలకు ఆదరణ తక్కువగా ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాతో 3డి సినిమాతో ఈ తరహ సినిమాలకు ఆదరణ పెరిగే అవకాశం ఉంది. శివాజీ 3డి చిత్ర విశేషాలను తెలియజేయడానికి సోమవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయగా నిర్మాత ఎమ్. ఎస్. గుహన్ మాట్లాడుతూ శివాజీ సినిమాని 3డి లోకి మార్చాలని నిర్ణయించుకుని ప్రారంభించాం. 3డి మారుస్తున్నట్లు రజిని కాంత్ గారికి కూడా తెలియదు. అయన ఈ చిత్ర 3డి క్లిప్పింగ్స్ చూసి ఆశ్చర్యపోయరన్నారు. ప్రస్తుతం నాలుగు వందల మంది టెక్నీషియన్స్ ఇందుకోసం పని చేస్తున్నారు. సెప్టెంబర్ లో శివాజీ 3డి సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకోస్తమన్నారు.

Exit mobile version