సున్నితమైన కథా చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తున్న తాజా చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఈ చిత్రం కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని అంటున్నాడు ఈ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ చిత్ర విశేషాలను తెలియజేయడానికి ప్రసాద్ లాబ్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ చిత్రంలోని పాత్రలలో తమని తాము చూసుకుంటారు. ఈ సినిమా చూసాక ఒక మంచి సినిమా చూసామన్న ఆనందం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.