ఆనందోత్సాహంలో బాలకృష్ణ ఫాన్స్

ఆనందోత్సాహంలో బాలకృష్ణ ఫాన్స్

Published on Mar 30, 2014 11:56 AM IST

Legend2
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన మాస్ మసాల ఎంటర్ టైనర్ ‘లెజెండ్’ సినిమాకి అన్ని ఎరియాల్లోనూ సాలిడ్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఈ సినిమాకి ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేలా దిశగా దూసుకు పోతోంది.

నందమూరి బాలకృష్ణ అందించిన ఈ సినిమా విజయం అభిమానుల్లో రాబోతున్న ఎలక్షన్స్ లో పాలుపంచుకోవడానికి నూతన ఉత్సాహాన్ని నింపింది. బాలకృష్ణ చివరి సూపర్ హిట్ ‘సింహా’ తర్వాత అభిమానులు హిట్ కోసం ఎంతో ఎదురు చూస్తున్న తరుణంలో ‘లెజెండ్’ సూపర్ హిట్ అవ్వడంతో వారి ఆనందానికి అవధులు లేవు. బాలకృష్ణ టిడిపి తరపున ప్రచారం చేస్తారు. ఈ విజయం బాలకృష్ణ కి, టిడిపికి మంచి ఉత్సాహాన్ని ఇస్తోంది.

బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ ‘లెజెండ్’ లో పొలిటికల్ పంచ్ డైలాగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. బాలకృష్ణకి ఈ డైలాగ్స్ హెల్ప్ అయ్యే అవకాశం కూడా ఉంది.

తాజా వార్తలు