సలార్ రీరిలీజ్ కి రెడీ.. రిలీజ్ డేట్ అదే !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ సినిమా సూపర్ హిట్ కావడంతో ‘సలార్’ సీక్వెల్‌ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, సలార్ రీరిలీజ్ కి రెడీ అవుతుంది. వచ్చే నెల మార్చి 21వ తేదీన సలార్ సినిమాను భారీ స్థాయిలో రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా దేవ తన డెన్ ఖాన్సార్ కి రిటర్న్ కాబోతున్నాడు. మొత్తానికి భారీ అంచనాలతో వచ్చిన సలార్, ఆ అంచనాలకు తగ్గట్టుగానే, హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో పాటు గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తోనూ చాలా బాగా ఆకట్టుకుంది.

ముఖ్యంగా,సినిమాలో ప్రభాస్ యాక్షన్ ఎలివేషన్స్ ఫ్యాన్స్ కి బాగా నచ్చాయి. అదేవిధంగా ఖాన్సార్ నగరం చుట్టూ అల్లిన కథలోని మెయిన్ ఎమోషన్ అండ్ ట్విస్ట్ లు కూడా బాగున్నాయి. ప్రభాస్ క్యారెక్టర్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ ను.., ప్రతి ట్రాక్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా బాగా తీర్చిదిద్దారు. హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా పార్ట్-2 పై మొత్తానికి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్ట్ 1 మళ్లీ రీరిలీజ్ కాబోతూ ఉండటం విశేషం. శ్రుతి హాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, మధు గురుస్వామి, ఈశ్వరీ రావు, టినూ ఆనంద్, రామచంద్రరాజు, ఐకాన్ సతీష్ తదితరులు నటించారు.

Exit mobile version