మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న అవైటెడ్ చిత్రం భారీ చిత్రం విశ్వంభర కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కి రాక ముందే మరో సాలిడ్ ప్రాజెక్ట్ ని చిరు స్టార్ట్ చేసేసారు. దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో మెగాస్టార్ 157వ సినిమా చేస్తుండగా ఈ సినిమా జెట్ స్పీడ్ లో కొనసాగుతుంది. అయితే ఆల్రెడీ ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండో షెడ్యూల్ కి సిద్ధం అయ్యింది.
ఈసారి మేకర్స్ డెహ్రాడూన్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ షూట్ కోసం ఆల్రెడీ మెగాస్టార్ అండ్ టీం స్టార్ట్ అయ్యారు. ఇక నెక్స్ట్ షూట్ ఇక్కడ ఉండనుంది అని చెప్పాలి. మొత్తానికి అనీల్ మాత్రం ఈ సినిమాని పరుగులు పెట్టిస్తున్నాడని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.