కొత్త అవతార్ లో వైరల్ గా మారిన పవన్ కళ్యాణ్!

కొత్త అవతార్ లో వైరల్ గా మారిన పవన్ కళ్యాణ్!

Published on Jun 8, 2025 4:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు రెండు సినిమాలు షూటింగ్ లని పూర్తి చేసిన సంగతి తెలిసిందే. నిన్ననే తన అవైటెడ్ ఓజి షూటింగ్ ని పూర్తి చేసుకున్న పవన్ లేటెస్ట్ గా ఊహించని అవతార్ లో కనిపించి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఆఫ్ లైన్ లో ఎక్కువగా వైట్ అండ్ వైట్ లోనే కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదే దాదాపు కంటిన్యూ అయ్యింది. కానీ ఆకస్మికంగా పవన్ తీ షర్ట్ షార్ట్స్ లుక్ లో కనిపించడం ఒకింత అభిమానులకే ఆశ్చర్యంగా మారింది. ఇవేమన్నా పాత ఫొటోలా అని కూడా చాలా మంది అనుకున్నారు కానీ కట్ చేస్తే కొత్తవే.. దీనితో పవన్ నుంచి ఈ లుక్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి ఫ్యాన్స్ అయితే వింటేజ్ వైబ్స్ ని కూడా ఇచ్చాయి. ప్రస్తుతం అవైటెడ్ హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు