రీసెంట్ గా తమిళ సినిమా దగ్గర సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో చిన్న సినిమా గానే వచ్చి సంచలన విజయం అందుకున్న సినిమా “టూరిస్ట్ ఫ్యామిలీ” కూడా ఒకటి. ఎం శశికుమార్ ప్రధాన పాత్రలో సిమ్రాన్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అభిషన్ జీవింత్ తెరకెక్కించిన ఈ సినిమా ఎమోషనల్ హిట్ గా నిలిచింది. భారీ వసూళ్లు కూడా అందుకున్న ఈ సినిమాకి అనేకమంది సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు.
అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఓటిటిలోకి వచ్చాక మాత్రం కొంచెం భిన్నమైన రెస్పాన్స్ ఈ చిత్రానికి వస్తుంది. ఈ సినిమా చూసిన వారు అంతా బాగానే ఉంది అంటున్నారు కానీ నిజ జీవితంలో కూడా ఇలా జరిగితే పరిణామాలు వేరేగా ఉంటాయి అనే టాక్ కూడా ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. ఆల్రెడీ బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే.
కానీ ఈ సినిమాలో చూపిన విధంగా ఓ మంచి కుటుంబమే కావచ్చు కానీ భారత్ కి అక్రమంగా వచ్చి కలిసిపోయి సర్వైవ్ అవ్వడం అనేది నిజ జీవితంలో ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది ప్రశ్నగా మారింది. ఇలా ఓటిటిలోకి వచ్చాక మాత్రం మంచి ప్రశంసలతో పాటుగా పలు ప్రశ్నలు కూడా ఇప్పుడు లేవనెత్తుతున్నాయి.