మన టాలీవుడ్ యంగ్ అండ్ డాషింగ్ హీరో అఖిల్ అక్కినేని కూడా ఒకడు. మరి అఖిల్ కి టాలీవుడ్ లో సాలిడ్ మార్కెట్ కూడా ఉంది. మరి ఇలా ప్రస్తుతం లెనిన్ సినిమా చేస్తున్న అఖిల్ నుంచి కొన్నాళ్ల కితమే తన పెళ్లి వార్త అక్కినేని అభిమానుల కళ్ళలో ఆనందం నింపింది. మరి రీసెంట్ గానే తన ఫియాన్స్ జైనాబ్ తో వివాహం అక్కినేని నాగార్జున ఇంట ఎంతో అట్టహాసంగా జరగగా నేడు మే 8 ఆదివారం సాయంత్రం నుంచి గ్రాండ్ గా రిసెప్షన్ ని చేశారు.
అయితే ఈ వేడుకలో ఒక ఫోటో మాత్రం పిక్ ఆఫ్ ది డే గా నిలిచింది అని చెప్పాలి. మరి ఇందులో యువ జంట సహా మిగతా అక్కినేని కుటుంబీకులు హీరోలు వారి కుటుంబం సహా కనిపించడం అనేది మరింత నిండుగా అనిపించింది. దీనితో ఈ పిక్ ఆ ఈవెంట్ కే హైలైట్ గా నిలిచి సోషల్ మీడియాలో సహా సినీ వర్గాల్లో, అక్కినేని అభిమానుల్లో మంచి వైరల్ గా మారింది. ఇక అఖిల్ నటించిన లెనిన్ సినిమా మళ్ళీ పునః ప్రారంభం కానుండగా ఈ ఏడాదిలోనే సినిమాని మేకర్స్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.