మహేష్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పై నయా గాసిప్స్!

వరుసగా మూడు భారీ హిట్లు అందుకున్న తర్వాత అదే హ్యాట్రిక్ జైత్ర యాత్రను కొనసాగించాలని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేపట్టిన మరో మాస్ ఎంటెర్టైనెర్ చిత్రం “సర్కారు వారి పాట” దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇలా మహేష్ ఎన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను చేపట్టినా సరే మహేష్ అభిమానుల కళ్ళు మాత్రం ఎప్పుడు ఒక్క సినిమా కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు.

అయితే అది సినిమానే అని కాకుండా ఆ కాంబో అని చెప్పొచ్చు. మహేష్ అండ్ మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ ల కాంబో అయితే టాలీవుడ్ లో నెవర్ బిఫోర్ రికార్డులకు పెట్టింది పేరు. అలాంటి ఈ కాంబో నుంచి హ్యాట్రిక్ చిత్రం కోసం మహేష్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

అయితే ఇపుడు ఇదే కాంబోకు సంబంధించి మరోసారి గాసిప్స్ ఊపందుకున్నాయి. ఈ ఇద్దరి కాంబోను సెట్ చెయ్యాలని మన టాలీవుడ్ లో ఒక టాప్ నిర్మాత ఒకరు గట్టిగా ట్రై చేస్తున్నారట. టైం కుదిరితే ఈ కాంబో వర్కౌట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట. మరి ఇందులో ఎంతవరకు నిజముందో కానీ నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఖాయం అని చెప్పాలి.

Exit mobile version