ప్రత్యేక ఇంటర్వ్యూ : క్రిష్ – రానాలోని అద్భుతమైన నటున్ని చూడటం కోసం ఈ సినిమా చూడండి

ప్రత్యేక ఇంటర్వ్యూ : క్రిష్ – రానాలోని అద్భుతమైన నటున్ని చూడటం కోసం ఈ సినిమా చూడండి

Published on Nov 29, 2012 6:49 PM IST


తన మొదటి సినిమాతోనే ఎంతో సున్నితమైన అంశాలను ఎంతో ఆసక్తికరంగా చెప్పే డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు క్రిష్. తన ప్రతి సినిమాలోనూ ఎంటర్టైనింగ్ తో పాటు ఫిలాసపీ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. తన డైరెక్షన్లో వస్తున్న మూడవ సినిమా ‘ కృష్ణం వందే జగద్గురుమ్’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా క్రిష్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించాము. ఈ చిట్ చాట్ లో సినిమా విశేషాల గురించి మరియు తన మేకింగ్ టెక్నిక్స్ గురించి మాతో పంచుకున్నారు. తన ప్రతి సినిమాలోనూ ఐటెం సాంగ్ ఎందుకుంటుందో మరియు రానా టాలెంట్ ఎలా నమ్మి ఈ సినిమా తీసాడో లాంటి విశేషాలు తెలుసు కోవడం కోసం ఈ ఇంటర్వ్యూ చదవండి.

ప్రశ్న) అసలు ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా ఎలా మొదలైంది?

స) చాలా కాలంగా ఈ ప్రాజెక్ట్ నా మైండ్ లో ఉంది. సురభి థియేటర్ నాటక రంగం వారి మీద డాక్యుమెంటరీ తీయాలని అనుకుంటున్నాను, అలాగే బళ్ళారిలో జరిగిన మైనింగ్ మాఫియా విషయంపై కూడా ఆలోచిస్తున్నాను. అప్పుడే మంచి, చెడుకి మధ్య నడిచే ఈ రెండు స్టొరీలను ఒకటిగా చేసి సినిమా తీయచ్చుగా అనిపించింది. ఈ రెండింటిలోనూ చాలా పోలికలున్నాయి. మన మాతృభూమిని హింసించి మైనింగ్ మాఫియా చేస్తుంటే మరో వైపు మోడ్రన్ యుగంలో థియేటర్ ఆర్ట్ కనుమరుగైపోతోంది. ప్రతి సినిమాలోనూ మంచి – చెడు రెండూ ఉంటాయి. ఈ సినిమాలో థియేటర్ ఆర్టిస్ట్ బి. టెక్ బాబు అంతర్గత మదనాన్ని చూపించాను.

ప్రశ్న) ఈ టైటిల్ పెట్టాలని మీకెలా అనిపించింది?

స) సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన ‘పొరపాటున ప్రామిస్ చేశావయ్యా కృష్ణా’ అనే పద్యం ఈ టైటిల్ కి మూలం. ఆ తర్వాత ఈ పద్యాన్ని నేను తీసుకొని అందులో నాకు తగ్గట్టు కొన్ని మార్పులు చేసాను, అది బాగా నచ్చడంతో శాస్త్రి గారు కూడా మెచ్చుకున్నారు. ఆ పద్యంలోని ఒక లైన్ ని ఈ సినిమాకి టైటిల్ గా పెట్టాను. నేను వెంకటేష్ గారి కోసం సిద్దం చేసుకున్న ఓ సినిమాకి ఈ టైటిల్ ని పెట్టుకున్నాను. ఈ సినిమాలో తన పాత్ర దైవత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. వెంకీ గారికి అనుకున్న టైటిల్ ఈ సినిమాకి కరెక్ట్ గా సరిపోతుందని దీనికి పెట్టాము. సురభి కళాకారుడైన బి.టెక్ బాబుకి మామూలు బి.టెక్ బాబుగామారే జగద్గురు తత్వం ఇందులో ఉంటుంది.

ప్రశ్న) ఈ పాత్రకి రానా కరెక్ట్ గా సరిపోయాడా?

స) ప్రస్తుతం మనకున్న యంగ్ హీరోలలో తెలుగు భాషనీ చాలా స్పష్టంగా చదవడం మరియు రాయడం తెలిసిన హీరోలలో రానా కూడా ఒకరు. అతని వాయిస్, 6 అడుగుల పర్సనాలిటీ మరియు తెలుగు పై తనకున్న పట్టు సినిమాకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. రానా చాలా ఆసక్తికరమైన మనిషి మరియు మేము ఇండస్ట్రీకి రాక ముందే చాలా సార్లు కాఫీ షాప్ లో కలుసుకునేవాళ్ళం ఆ సమయంలో ఒక సారి శ్రీ శ్రీ గారి ‘ఆహా’ అనే ఒక పద్యాన్ని వినిపించాను. ఆ తర్వాతి రోజు రానా నాకు ఫోన్ చేసి ఎంతో ఆవేశపూరితంగా ఆ పద్యాన్ని చెప్పాడు. అదే సినిమాగా రేపు మీ ముందుకు రానుంది. అది విన్న ఎవరికైనా రానా టాలెంట్ ఏంటో తెలుస్తుంది.

ప్రశ్న) ఇప్పటికే నటిగా నయనతార నిరూపించుకున్నారు. ఇప్పుడే నటుడిగా అడుగులేస్తున్న రానా పక్కన ఆమె కరెక్ట్ గా సెట్ అయ్యిందా?

స) నేను స్క్రిప్ట్ కోసం ‘దేవిక’ పాత్ర రాసుకునేటప్పుడే ఆ పాత్ర నయనతార చెయ్యాలని ఊహించుకొని రాసుకున్నాను. తను ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, జర్నలిస్ట్ మరియు తెలివితేటలు కలగలిపిన పాత్రని నయనతార ఈ సినిమాలో చేస్తోంది. రానా ఫిజిక్ కి ఎ మాత్రం ఎక్కువ కాకుండా నయనతరార ఉంటుంది. మాకు ఎలాగు ఆ పాత్రకి ఓ స్టార్ కావలి అదే నయనతార అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అది కాకుండా సీత(రామావతారంలో) గా చేసిన నయనతార ఇప్పుడు దేవిక (కృష్ణావతారంలో)గా కనిపించనుంది.

ప్రశ్న) మీకు భారతీయ పురాణాలంటే బాగా ఇష్టం గా ఉన్నట్టు ఉంది…

స) నాకు మామూలుగా కథలంటే ఇష్టం. వేరే వేరే సంస్కృతులని చూస్తే మనకు కొన్ని పోలికలు కనపడుతూ ఉంటాయి. నేను జోసెఫ్ కాంప్ బెల్ రాసిన ‘ది హీరో విత్ ఎ తౌసండ్ ఫేసెస్’ బుక్ చదివాను మరియు దాన్ని చాలా బాగా ఎంజాయ్ చేసాను. మీరు జీసస్ స్టొరీ తీసుకుంటే అందరూ అతన్ని చంపేయాలనుకుంటారు కానీ ఒక నక్షత్రం అతని దైవత్వాన్ని గురించి చెబుతుంది. ఆలాగే కృష్ణున్ని కూడా చంపాలనుకుంటారు కానీ ‘ ఆకాశవాణి’ అతని దైవత్వాన్ని చెబుతుంది. ఈ స్టొరీలన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

ప్రశ్న) మీరు ఫ్రీ టైంలో ఏం చేసి ఎంజాయ్ చేస్తుంటారు?

స) (నవ్వుతూ) నేను ఎక్కువగా కాఫీ షాప్స్ లో గడుపుతుంటాను, బాగా బుక్స్ చదువుతుంటాను మరియు వాలీ బాల్ ఆడతాను. అలాగే ఫుడ్ బాగా తింటాను, ఎక్కడ మంచి ఫుడ్ దొరుకుతుందా అని అన్వేషిస్తుంటాను. మీరు ఎక్కడ మంచి ఫుడ్ దొరుకుతుందని లేదా మంచి రెస్టారెంట్స్ ఏవని అడిగితే నేను చెప్తాను.

ప్రశ్న) ఇప్పటివరకూ మీరు తీసిన మూడు సినిమాల్లో మీకు బాగా సంతృప్తిని ఇచ్చిన సినిమా ఏది?

స) ప్రతి ఒక్క సినిమా వాటి తరహాలో నాకు సంతృప్తిని ఇచ్చాయి. నాకు ‘గమ్యం’ ఇండస్ట్రీలో బ్రేక్ ఇచ్చింది. నాకు పర్సనల్ గా ‘వేదం’ చాలా ఇష్టం ఎందుకంటే అందులో రకరకాల మనుషుల మనస్తత్వాలని మరియు మంచి సీన్స్ ఉన్నాయి. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ మంచి యాక్షన్ ఎంటర్టైనర్ మరియు నాకు కమర్షియల్ గా బిగ్ హిట్ ఇచ్చే సినిమా.

ప్రశ్న) ఈ సినిమా యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు రానా పలుసార్లు గాయపడ్డాడు. అంత రిస్క్ తో కూడిన యాక్షన్ సీన్స్ అవసరమా?

స) రానా చాలా టఫ్ పర్సన్. తను నమ్మితే ఎంత రిస్క్ అయినా చేస్తాడు. అలా జరిగినందుకు నాకూ బాధగానే ఉంది కానీ యాక్షన్ సీక్వెన్స్ సూపర్బ్ గా వచ్చాయి మరియు రానా పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం మరియు మంచి పేరు వస్తుంది.

ప్రశ్న) మీరు నెక్స్ట్ చేయబోయే సినేమాలేమిటి?

స) నా తదుపరి సినిమా మహేష్ బాబు హీరోగా, అశ్వినీదత్ ప్రొడక్షన్లో ఉంటుంది. ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ కూడా చాలా కాలం క్రితమే పూర్తి చేసాను. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ విడుదలై, దానికి సంబందించిన ఆన్ని ప్రమోషన్స్ పూర్తయిన తర్వాత మరో సారి స్క్రిప్ట్ ని చెక్ చేసుకుంటాను. ఈ సినిమా 2013 ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

ప్రశ్న) మొదటిసారి మహేష్ బాబు లాంటి పెద్ద హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇది ‘క్లాస్ సినిమా’ నా లేక ‘మాస్ సినిమా’నా?

స) (నవ్వుతూ) మామూలుగా నేను చాలా మాస్ మనిషిని. మీరు నా సినిమాలు చూస్తే ప్రతి సినిమాలోనూ ఒక ఐటెం సాంగ్ ఉంటుంది ఎందుకు? ఎందుకంటే నాకు అవంటే ఇష్టం. రజినీకాంత్ హీరోయిజం సీన్స్ లేదా మహేష్ బాబు మాస్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ లు నచ్చని వారు ఎవరుంటారు చెప్పండి. మాస్ లేదా క్లాస్ అని చెప్పడం వృధా, నా సినిమాలన్నీ మంచి స్టొరీ లైన్ తో ఎంటర్టైనింగ్ గా ఉంటాయి.

ప్రశ్న) ఈ సినిమా షూటింగ్ టైంలో ఏమన్నా మర్చిపోలేని సంఘనలు ఉంటె చెబుతారా?

స) నా సినిమాలోని ఓ పాటలో డాన్స్ వేయడం కోసం సెట్స్ కి వచ్చిన అప్పుడు పొందిన అనుభూతిని మాత్రం ఎప్పటికీ మరిచిపోలేను. రానా మరియు వెంకటేష్ కలిసి డాన్స్ వేయడం చూసి చాలా ఎంజాయ్ చేసాను.

ప్రశ్న) ఇప్పటివరకూ ఈ సినిమాకి మీరందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి?

స) నాకు వెంకటేష్ గారి నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది. వెంకటేష్ గారు సినిమా చూసారు మరియు సినిమా థియేటర్ నుండి బయటకొచ్చిన తర్వాత కూడా రానా పాత్రలోనే ఉన్నాను అని మనస్పూర్తిగా అన్నారు. అది నేను ఎప్పటికీ మరిచిపోలేని ప్రశంశ.

ప్రశ్న) మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ కోసం పనిచేస్తున్నారా?

స) నా మోటో ఈ రోజు మాత్రమే, నేను ప్రస్తుతంలోనే జీవిస్తాను, ఈ రోజులోనే ఉంటాను.(నవ్వుతూ)

ప్రశ్న) ప్రేక్షకులకు ఏమన్నా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారా?

స) రేపు వెళ్లి ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమా చూడండి. ఈ సినిమాలో రానా అద్భుతమైన నటనను చూడొచ్చు. మీరు ఒకసారి సినిమా చూస్తే అర్థమవుతుంది నేనెందుకు రానా నటన గురించి అంతలా చెప్పాను అనేది అర్ధమవుతుంది.

అంతటితో క్రిష్ తో మా ఇంటర్వ్యూ ముగిసింది. ఆ తర్వాత కాఫీ షాప్ కి సంబందించిన విశాల్ ‘ఆల్ ది బెస్ట్’ డిజైన్ తో కాపచినో క్రిష్ కి తెచ్చిచ్చాడు. క్రిష్ అతనితో ఒక ఫోటో కూడా తీసుకున్నాడు. అది మీకు కింద ఇస్తున్నాము చూడండి. ఈ ఇంటర్వ్యూ చదివి ఎంజాయ్ చేయండి.
Translated by Rag’s

తాజా వార్తలు