‘కొత్త లోక’ కి సాలిడ్ ఓపెనింగ్స్!

Kotha-Lokah-2

లేటెస్ట్ గా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో మలయాళ డబ్బింగ్ చిత్రం “కొత్త లోక” కూడా ఒకటి. కల్యాణి ప్రియదర్శిన్ మెయిన్ లీడ్ లో ప్రేమలు నటుడు నెస్లన్ కీలక పాత్రలో నటించిన ఈ సూపర్ హీరో సినిమా మొదట మలయాళంలో విడుదల అయ్యి సాలిడ్ హిట్ టాక్ తెచ్చుకుంది.

అయితే తెలుగులో మాత్రం ఒకింత లేట్ గా పలు ఇబ్బందుల నడుమ రిలీజ్ అయినప్పటికీ సాలిడ్ టాక్ ని ఈ సినిమా సొంతం చేసుకోవడమే కాకుండా మంచి ఓపెనింగ్స్ కూడా సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిన్న డే 1 శనివారం పి ఆర్ లెక్కల ప్రకారం కేవలం తెలుగు స్టేట్స్ నుంచి కొత్త లోక 1 కోటికి పైగానే గ్రాస్ అందుకున్నట్టు తెలుస్తోంది.

పెద్దగా బజ్, ప్రమోషన్స్ కూడా లేకుండానే వచ్చిన ఈ సినిమా ఈ రేంజ్ లో ఆకట్టుకోవడం విశేషం. ఇక ఈ సినిమాకి దర్శకుడు డామినిక్ అరుణ్ వర్క్ చేయగా తెలుగులో నాగవంశీ సమర్పణలో విడుదల అయ్యింది.

Exit mobile version