‘వీరమల్లు’ విషయంలో క్రిష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకులు క్రిష్ జాగర్లమూడి అలాగే జ్యోతి కృష్ణలు తెరకెక్కించిన భారీ చిత్రమే “హరిహర వీరమల్లు”. అయితే ఈ సినిమా ఊహించని ఫలితాన్ని అందుకోవాల్సి వచ్చింది. మరి ఈ సినిమాని దాదాపు 70 శాతానికి పైగా క్రిష్ పూర్తి చేస్తే మిగతా భాగాన్ని జ్యోతికృష్ణ పూర్తి చేయడం జరిగింది. మరి క్రిష్ తప్పుకోవడం సినిమాకి బాగా ఎఫెక్ట్ అయ్యింది.

అసలు క్రిష్ ఎందుకు తప్పుకున్నారు అనేది ఇపుడు బయటకి వచ్చింది. తనకి పవన్ కళ్యాణ్, నిర్మాత ఏ ఎం రత్నం గారు అంటే ఎంతో గౌరవం అని అయితే ఈ సినిమా చేస్తున్న సమయంలో తనకి ఉన్న పలు వ్యక్తిగత కారణాలు రీత్యా దర్శకునిగా కొనసాగలేకపోయాను అని తెలిపారు. దీనితో ఈ ట్విస్ట్ వైరల్ గా మారింది. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా ఫలితం మాత్రం మారలేదు. ఇక క్రిష్ నుంచి ‘ఘాటి’ సినిమా ఈ సెప్టెంబర్ 5న రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version