తెలుగు బుల్లితెర దగ్గర ఒక స్మాషింగ్ హిట్ కామెడీ షో ‘జబర్దస్త్’ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఇలా జబర్దస్త్ ద్వారా తమ సత్తా చాటి ఇపుడు మంచి పొజిషన్ లో ఉన్న కమెడియన్స్ లో గెటప్ శ్రీను కూడా ఒకరు. బుల్లితెర కమల్ హాసన్ గా పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను ఇపుడు తెలుగు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారుతున్నాడు.
జబర్దస్త్ పాత స్కిట్స్ అన్నీ సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఇదంతా దహా నుంచి స్టార్ట్ అయ్యింది. ఎప్పుడో 2016లో చేసిన స్కిట్ లో గెటప్ శ్రీను చేసిన గెటప్ ఇపుడు కూలీ సినిమాలో అమీర్ ఖాన్ తో మ్యాచ్ అవ్వడంతో అక్కడ నుంచి తెలుగు యువతలో గెటప్ శీను మరోసారి చర్చగా మారాడు. లేటెస్ట్ గా ‘ఓజి’ కి కూడా స్టార్ట్ అయ్యాయి.
ఇలా మొత్తానికి సోషల్ మీడియాలో మాత్రం ప్రస్తుతం గెటప్ శీను హవా నడుస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈటీవీ 30 ఏళ్ల ప్రస్థానంలో తాను కూడా కొంత భాగం అయినందుకు ఈటీవీ వారు పంపిన విషెస్ ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన విధేయతని ఈటీవీ, మల్లెమాల వారికి వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ కామెంట్స్ లో కూడా తన క్లిప్స్ ని నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు.
కళమీద మక్కువతో,కళాకారుడవ్వాలని ఎన్నో ఆశలతో సినీ పరిశ్రమకు వచ్చి ..
ఆ సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనే సమయంలో నాలాంటి కళాకారులకి ఈటీవీ మరియు మల్లెమాల సంస్థ సినీ రంగ ప్రవేశానికి పూలబాట వేసారు ..ఈ’టీవీ’30 ఏళ్ల విజయ ప్రయాణంలో ..నేను కూడా భాగస్వామ్యం కావడం నా అదృష్టం .????????
ఈ 30… pic.twitter.com/QHIygSIOic— GETUPSRINU (@getupsrinu3) August 31, 2025