ఫోటో మూమెంట్: అల్లు అర్జున్ తో పవన్ కళ్యాణ్

నిన్ననే అల్లు కుటుంబం ఇంట తీరని విషాదం చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనితో కొణిదెల కుటుంబం నుంచి మెగాస్టార్ నుంచి వైష్ణవ్ తేజ్ వరకు అంతా అల్లు అరవింద్, అల్లు అర్జున్ కుటుంబీకులకు ధైర్యం చెప్పి అంతిమ క్రియలు వరకు ఉన్నారు. అయితే నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం వీరిలో మిస్ అయ్యారు.

కానీ ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ సహా అల్లు అరవింద్ లని కలిసిన విజువల్స్ బయటకి వచ్చాయి. నిన్న విశాఖ లో పవన్ కళ్యాణ్ సాయంత్రం సభ పూర్తి చేసుకొని అర్ధ రాత్రి నాటికి అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. వారితో కలిసి కూర్చొని మాట్లాడి తన పరామర్శ అందించారు. దీనితో ఈ మూమెంట్స్ అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వైరల్ గా మారాయి.

Exit mobile version