నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రమే అఖండ 2 తాండవం. బాలయ్య కెరీర్ లోనే భారీ హైప్ సెట్ చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఉన్నారు. అయితే గత కొన్నాళ్ల నుంచి అఖండ 2 ఓటీటీ డీల్ పై పలు రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా జియో హాట్ స్టార్ వారు పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 కూడా వారే సొంతం చేసుకున్నట్టు టాక్ వచ్చింది. అయితే లేటెస్ట్ గా హాట్ స్టార్ తో అఖండ 2 మేకర్స్ భారీ మొత్తానికి డీల్ క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. అఖండ 2 పాన్ ఇండియా ఓటీటీ హక్కులు ఏకంగా 80 కోట్లకి పైగా పలికినట్టు తెలుస్తోంది. దీనితో మన తెలుగు నుంచి ఇదొక భారీ డీల్స్ లో ఒకటిగా నిలిచింది అని చెప్పాలి.