‘ఘాటీ’లో అనుష్క విశ్వరూపం చూస్తారు అంటున్న దర్శకుడు

Ghaati, Movoe Anushka

చాలా కాలం గ్యాప్ తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క నుంచి వస్తున్న అవైటెడ్ చిత్రమే “ఘాటీ”. కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు విక్రమ్ ప్రభు మేల్ లీడ్ లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ అడ్వెంచర్ యాక్షన్ చిత్రం వచ్చే ఈవారం విడుదల కాబోతుంది. మరి ఈ సినిమాలో అనుష్క విశ్వరూపాన్ని ఆడియెన్స్ చూస్తారని లేటెస్ట్ మీట్ లో దర్శకుడు క్రిష్ బలంగా చెబుతున్నారు.

ఘాటీ సినిమాలో సోల్ అందరికీ నచ్చుతుంది అని అనుష్క కోసం థియేటర్స్ కి వచ్చిన వారు మంచి ఫీల్ తో బయటకి వెళ్తారని చెబుతున్నారు. దీనితో అనుష్క అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రానికి నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ సెప్టెంబర్ 5న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version