మా లేడీ డైరెక్టర్ బాగానే ఉన్నారు, కోనా వెంకట్ క్లారిటీ

డైరెక్టర్ సంజనా రెడ్డి ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు నిర్మాత కోనా వెంకట్ చెక్ పెట్టారు. ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదని ఆయన వివరణ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న సంజనా రెడ్డిని హైదరాబాద్ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారని, వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉందని వార్తలు రాగా ఆయన ఖండించారు.

ఆయన ట్విట్టర్ వేదికగా సంజనా రెడ్డి కేవలం జ్వరంతో హాస్పిటల్ జాయిన్ అయ్యారని. ప్రస్తుతం ఆమె చాలా బాగున్నారని ఆ వదంతులలో నిజం లేదని చెప్పారు. గతంలో రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన రాజుగాడు చిత్రానికి సంజనా రెడ్డి దర్శకత్వం వహించారు. కోన వెంకట్ నిర్మాతగా ఉన్న కరణం మల్లేశ్వరి బయోపిక్ కి దర్శకురాలిగా సంజనా రెడ్డి వ్యవహరిస్తున్నారు.

Exit mobile version