మిస్ ఇండియా డబ్బింగ్ షురూ చేసిందట.

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ మిస్ ఇండియా. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మిస్ ఇండియా సినిమాలో కీర్తి గతంలో ఎన్నడూ చేయని ఓ స్పెషల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. కాగా మిస్ ఇండియా మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టారని తెలుస్తుంది. ఈ విషయాన్ని నిర్మాత మహేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

మిస్ ఇండియా చిత్రానికి దర్శకుడు నరేంద్ర నాధ్ దర్శకత్వం వహిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ వంటి వారు కీలకపాత్రలు చేస్తున్నారు. ఇక కీర్తి సురేష్ పెంగ్విన్, గుడ్ లక్ సఖి అనే మరో రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తున్నారు.

Exit mobile version