మంచు విష్ణు హీరోగా ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన భారీ చిత్రం “కన్నప్ప” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ స్టార్స్ అంతా ఈ సినిమా లోనే కనిపించారు. ఇలా రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో డీసెంట్ గా పెర్ఫామ్ చేసింది. ఇక అక్కడ నుంచి దాదాపు 10 వారాలు తర్వాత ఓటిటి రిలీజ్ కి ఈ చిత్రం వచ్చింది. ఈ సినిమా హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
మరి అందులో పాన్ సౌత్ భాషల్లో ముందు స్ట్రీమింగ్ కి వచ్చింది కానీ హిందీలో రాలేదు. మరి ఇప్పుడు ఫైనల్ గా హిందీలో కూడా చిత్రం స్ట్రీమింగ్ కి వచ్చేసింది. హిందీలో కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో వారే నేటి నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. మరి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ సినిమాలో మహా శివునిగా కనిపించగా రెబల్ స్టార్ ప్రభాస్ రుద్రగా కనిపించాడు. ఇక ఈ సినిమాకి స్టీఫెన్ డేవిస్సి సంగీతం అందించగా మంచు మోహన్ బాబు నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి