యువ నటుడు కమల్ కామరాజు ఈ ఏడాదిలో ఒక ఇంటివాడు కానున్నాడు. మాకు లభించిన సమాచారం ప్రకారం కమల్ సుప్రియ అనే అమ్మాయిని పెళ్లి చేస్కోనున్నాడు. సుప్రియ ఐ.ఐ.టి చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని ఒక ప్రముఖ బహుళ జాతి సంస్థలో పనిచేస్తుంది.
‘ఆవకాయ బిర్యాని’, ‘గోదావరి’ సినిమాల ద్వారా కమల్ మనకు చేరువయ్యాడు. కమల్ మరియు సుప్రియలకు 123 తెలుగు.కామ్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం