మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ఎవడు’ చిత్రంలో అందాల భామ కాజల్ అగర్వాల్ ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక కీలక పాత్ర పోషించనున్నారు అతనికి జంటగా కాజల్ అగర్వాల్ కనిపించనున్నారు. ఈ రెండు పాత్రలు ఈ చిత్రానికి చాలా కీలకం అని ఈ చిత్ర యూనిట్ వారు చెబుతున్నారు.
‘ఎవడు’ చిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత మరియు అమీ జాక్సన్ కథానాయికలుగా నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని 2013లో విడుదల చేయనున్నారు. ఇంతమంది పెద్ద స్టార్లు ఈ చిత్రంలో నటిస్తుండడం వల్ల ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని చూడాలనే ఆసక్తి రోజు రోజుకీ పెరిగిపోతోంది.