అబ్రాడ్ లో ఇరుక్కుపోయిన కాజల్.!


హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ సెప్టెంబర్ వరకు అబ్రాడ్ లో ఇరుక్కు పోయింది. ఏంటి అవాక్కయ్యారా.! వాస్తవం ఏమిటంటే ప్రస్తుతం తను నటిస్తున్న తెలుగు, తమిళం మరియు హిందీ సినిమాలన్నీ అబ్రాడ్ లోనే చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ చిత్రాలన్నీ ఎక్కువ భాగం యూరప్ లోనే చిత్రీకరణ జరుపుకొంటున్నాయి. ఇటీవలే కాజల్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సరసన నటిస్తున్న ‘బాద్షా’ చిత్ర మొదటి షెడ్యూల్ ఇటలీలో పూర్తి చేసుకోవడంతో, కాజల్ అగర్వాల్ ప్రస్తుతం రవి తేజ హీరోగా తెరకెక్కుతున్న ‘సార్ ఒస్తారా’ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇది పూర్తవగానే సూర్య హీరోగా నటిస్తున్న ‘డూప్లికేట్’ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో తెరకెక్కుతోంది.

అది కూడా పూర్తి చేసుకున్న తర్వాత రామ్ చరణ్ మరియు వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కోసం సెప్టెంబర్ 5న కాజల్ తిరిగి ఇండియాకు రానుంది. ఈ విషయం గురించి కాజల్ మాట్లాడుతూ’ నేనెప్పుడూ ఇన్ని రోజులు ఇండియాను వదిలి ఉండలేదు మరియు ఇది నాకు ఒక కొత్త రకమైన అనుభూతినిస్తోంది. కెరీర్లో వరుసగా సినిమాలు చేస్తున్నాను కానీ ఇప్పటి వరకూ ఎప్పుడూ అలిసిపోయాను అనే భావన రాలేదు. ప్రతీ సినిమాలో కొత్తరకమైన పాత్రలు చేయడమే అనుకుంటా నేను అలిసి పోక పోవడానికి గల కారణం. ఈ చిత్రాల చిత్రీకరణ తర్వాత ఒక హిందీ చిత్రంలో నటించాలి, ఆ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని’ ఆమె అన్నారు.

కాజల్ యూరప్ ట్రిప్ బాగా ఎంజాయ్ చెయ్యాలని కోరుకుందాం. తను ఇలా బిజీగా ఉండడం మాత్రం అభిమానులకు సంతోషించ దగ్గ విషయం ఎందుకంటే కాజల్ ని ఎక్కువ సినిమాల్లో చూసే అవకాశం ఉంది.

Exit mobile version