విజయ్ తో స్టెప్పులేస్తున్న కాజల్ అగర్వాల్


కాజల్ అగర్వాల్ నటిస్తున్న సినిమాల యురోపియన్ షెడ్యూల్స్ త్వరలోనే ముగియనున్నాయి. కాజల్ సూర్య సరసన నటిస్తున్న ‘మాట్రాన్’ సినిమా చిత్రీకరణ నార్వేలో జరుగుతోందని ఇటీవలే తెలిపాము. నార్వేలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ భామ ప్రస్తుతం విజయ్ సరసన నటిస్తున్న ‘తుపాకి’ చిత్రం కోసం స్విట్జర్లాండ్ లోని జెనివా చేరుకుంది. ఎ. ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని ఒక పాటను ప్రస్తుతం జెనివాలో చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ మరియు క్రైమ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ పనిచేస్తున్నారు. హారీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ పూర్తి చేసుకున్న తర్వాత కాజల్ గ్రీస్ లో చిత్రీకరణ జరుపుకోనున్న రామ్ చరణ్ ‘నాయక్’ సినిమాలో నటించనుంది. ఈ చిత్రంలో చిరంజీవి ఎవర్గ్రీన్ హిట్ సాంగ్ అయిన ‘శుభలేఖ’ పాట రీమిక్స్ లో రామ్ చరణ్ సరసన డాన్స్ చేసే గోల్డెన్ చాన్స్ ని కాజల్ దక్కించుకుంది. వి.వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమలా పాల్ రెండవ కథానాయికగా నటిస్తోంది.

Exit mobile version