విడుదలైన ‘మాస్క్’ మూవీ ఆడియో


‘రంగం’ ఫేం జీవా హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘ మాస్క్’. నిన్న సాయంత్రం హైదరాబాద్లోని అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఈ చిత్ర ఆడియో వేడుక జరిగింది. ఈ చిత్రంలో జీవా సూపర్ హీరోగా కనిపించనున్నారు, ఇది సౌత్ ఇండియాలో వస్తున్న తొలి సూపర్ హీరో చిత్రం. మిస్కిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తెలుగులో ‘మాస్క్’ అనే టైటిల్ ని ఖరారు చేయగా, తమిళంలో ‘మూగమూడి’ అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి చౌదరి ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో జీవా, పూజా హెడ్జ్, నరైన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కృష్ణ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సత్య సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు.

Exit mobile version