రాజశేఖర్ ఆరోగ్యంపై ఆ వార్తలను కొట్టేసిన జీవిత.!

ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా తీరని పెను మార్పులు నెలకొల్పిన ప్రమాదకారి వైరస్ కరోనా ఎప్పుడు తగ్గుతుందో కూడా అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. ఇంకా అన్ని చోట్లా కూడాను కేసులు అలా నమోదు అవుతున్నాయి. మన సినీ పరిశ్రమలో కూడా చాలానే నష్టం వాటిల్లింది. ప్రముఖ తారలు కూడా కరోనా బారిన పడ్డారు.

అలా ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్ మరియు అతని కుటుంబం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వారిలో రాజశేఖర్ మినహా మిగతా అంతా కోలుకున్నారు కానీ రాజశేఖర్ కు మాత్రం ఇంకా చికిత్స కొనసాగుతుంది. అయితే ఈ లోపలే ఆయన ఆరోగ్యం కు సంబంధించి పలు వార్తలను ఆయన సతీమణి జీవిత కొట్టి పారేసారు.

రాజశేఖర్ వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారన్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని ఇప్పటి వరకు అతనికి వెంటిలేటర్ పెట్టనే లేదని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ఇప్పుడు రాజశేఖర్ క్రమంగా కోలుకుంటున్నారని త్వరలోనే ఐసీయూ నుంచి బయటకు వస్తారని ఆమె క్లారిటీ ఇచ్చారు.

Exit mobile version