బిగ్ బాస్ 4 – ఈరోజు ఈ ఇద్దరూ ఎలిమినేషనా.?

మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి “బిగ్ బాస్” నాలగవ సీజన్ కూడా సగం పూర్తి అయ్యిపోతుంది. అయితే ఇప్పటికే ఎన్నో కీలక చేంజెస్ మనం చూసేసాము. అలాగే ప్రతీ వారాంతం ఎలా అయితే ఎలిమినేషన్ ఉంటుందో అదే విధంగా ఈ వారాంతం కూడా ఎలిమినేషన్ ఉంది. ఇప్పటికే వోటింగ్ క్లోజ్ అయ్యి నామినేషన్ లో ఉన్న వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని షో ఫాలోవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే మేకర్స్ మాత్రం ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారా అన్న హింట్ ఇస్తున్నారు. ఆ ఇద్దరు అవినాష్ అలాగే లేటెస్ట్ గా క్యాప్టెన్ అయినటువంటి అమ్మా రాజశేఖర్ లు ఉన్నారని అంటున్నారు. అయితే వీక్షకులు మాత్రం ఇప్పటికే అమ్మా రాజశేఖర్ ఎలిమినేషన్ అని ఫిక్స్ అయ్యిపోయారు. మరి అతడొక్కడే ఎలిమినేట్ అవుతాడా లేక ఇద్దరూనా అన్నది చూడాలి.

Exit mobile version