ఇక “కేజీయఫ్ 2” ఈ రేస్ నుంచి తప్పుకున్నట్టేనా?


ప్రస్తుతం కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. దేశ వ్యాప్తంగా కూడా భారీ స్థాయి అంచనాలను నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక కేవలం కొంత భాగం మాత్రమే మిగిలి ఉన్న షూట్ ను చిత్ర యూనిట్ తొందరలోనే ముగించనున్నారు.

ఇటీవలే పలు కీలక షాట్స్ ను తెరకెక్కించిన నీల్ ఇప్పుడు సంజయ్ దత్ పై కీలక షాట్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ చిత్రం విడుదల ఎప్పుడు అన్నది టాక్ ఎప్పటి నుంచో ఉన్నదే. ఇక దానిపై కాస్త సస్పెన్స్ ఇప్పుడు కొనసాగుతుంది. మొదట ఈ చిత్రం విడుదల సంక్రాంతి సీజన్లో ఉంటుంది అని గట్టి బజ్ వినిపించగా ఇపుడు అదే సమయానికి కేవలం టీజర్ మాత్రమే ఉంటుంది అని మరో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది.

దీనితో అప్పటి రేస్ కు ఈ భారీ చిత్రం డౌటే అన్న అనుమానాలు మొదలయ్యాయి. జనవరి 8 న టీజర్ వస్తుంది అని ఈ మధ్య కాలంలోనే గాసిప్స్ మొదలయ్యాయి. మరి ఈ తక్కువ గ్యాప్ లోనే సినిమా విడుదల అయ్యే ఛాన్స్ ఉందా అంటే లేదని చెప్పొచ్చు. అలాగే అప్పటికి పరిస్థితులు కూడా ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. సో ఈ భారీ చిత్రం ఆ రేస్ లో లేనట్టే అని చెప్పుకోవచ్చు.

Exit mobile version