షూటింగ్ ప్రారంభం అవకముందే బిజినెస్ చేస్తున్న ఎన్టీఆర్ సినిమా


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దమ్ము’ ఇటీవల విడుదల కాగా మొదట్లో మిశ్రమ స్పందన లభించినప్పటికీ ఆ తరువాత మాస్ ఏరియాల్లో కలెక్షన్లు బాగా సాధించి నిర్మాతను, బయ్యర్లను సేఫ్ జోన్లో పడేసింది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ త్వరలో చేయనున్న ‘బాద్షా’ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం అవకముందే ఈ సినిమా బిజినెస్ మొదలైంది. గుంటూరు మరియు నెల్లూరు ఏరియాలకు సంభందించిన డిస్ట్రిబ్యూషణ్ హక్కులు ఇప్పటికే అమ్ముడుపోయాయి. నెల్లూరు ఏరియాకి సంభందించిన హక్కులు శ్రీ నికేతన్ ఫిల్మ్స్ వారు దక్కించుకోగా గుంటూరు ఏరియా హక్కులు హరి వెంకట్ పిక్చర్స్ వారు దక్కించుకున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం కూడా అవకముందే బిజినెస్ అవుతుంది ఎన్టీఆర్ క్రేజ్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. జూన్ 1 నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Exit mobile version