పౌరాణికాల్లో మల్టీ స్టారర్ చెయ్యాలనుంది – నాగార్జున

పౌరాణికాల్లో మల్టీ స్టారర్ చెయ్యాలనుంది – నాగార్జున

Published on Oct 18, 2012 8:58 AM IST


అక్కినేని నాగార్జున ప్రముఖ నటుడే కాకుండా మంచి వ్యాపారవేత్త కూడా అయన పరిస్థితులకు బిన్నంగా ఆలోచించి తనకి నమ్మకం కలిగిన వాళ్ళతో చిత్రాలు చెయ్యడానికి ఎప్పుడూ వెనకాడరు. అయన ప్రస్తుతం పౌరాణికాల్లో మల్టీస్టారర్ చిత్రాన్లు చెయ్యాలని అనుకుంటున్నారు. ఇది పరిశ్రమకి మంచి తరుణం. “పాత రోజుల్లో లాగా ఇప్పటి స్టార్స్ కూడా పౌరాణికాల్లో మల్టీ స్టారర్ చెయ్యాలి “మహా భారతం” వంటి వాటిని ప్రస్తుతం చేస్తే చాలా బాగుంటుంది నేను అందులో మీసాలు ఉన్న ఏ పాత్ర చెయ్యడానికి అయినా సిద్దం” అని అన్నారు. అయన ఈ మధ్య 2011 నంది అవార్డ్స్లో “రాజన్న” చిత్రంకి గాను స్పెషల్ జ్యూరి అవార్డు గెలుచుకున్నారు. నాగార్జున నటించిన “డమరుకం” చిత్రం త్వరాలో విడుదల కానుంది. నాగార్జున మల్టీ స్టారర్ చిత్రానికి ఒప్పుకునేసారు ఇక ఎవరయినా దర్శకులు లేదా నిర్మాతలు ఇలాంటి కథతో వస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు