టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న ‘మిరాయ్’పై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో మంచు మనోజ్ నటిస్తున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ గురించి ఆయన మాట్లాడారు. ఈ సినిమాలో ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని.. ఇది చాలా బాగా వచ్చిందని.. ఈ సీక్వెన్స్‌ను పదిహేను రోజుల పాటు కష్టపడి చిత్రీకరించామని.. ఇది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.
ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా గౌర హరి సంగీతం అందిస్తున్నాడు. మరి సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ చేస్తుందో చూడాలి.