ఆ హీరోతో లోకేశ్ కనగరాజ్ సినిమా లేనట్టేనా..?

ఆ హీరోతో లోకేశ్ కనగరాజ్ సినిమా లేనట్టేనా..?

Published on Sep 6, 2025 8:00 PM IST

కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఏర్పడతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేయడంలో ఆయన ఎక్స్‌పర్ట్. అయితే, సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రం మాత్రం ప్రేక్షకులకు లోకేశ్ మార్క్ కిక్ ఇవ్వలేదు. దీంతో ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.

ఇక ఆ సినిమా తర్వాత లోకేశ్ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్‌తో ఓ సూపర్ హీరో చిత్రం చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి లోకేశ్ కూడా అవుననే సమాధానం చెప్పారు. అయితే, నిజానికి లోకేశ్ మరో తమిళ హీరో సూర్యతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఇరుంబు కాయ్ మాయావి’ అనే సూపర్ హీరో మూవీ చేయాల్సింది. కానీ, ఇప్పుడు అమీర్ ఖాన్‌తో సూపర్ హీరో సినిమా అని ఆయన అనడంతో తమిళ ప్రేక్షకులు లోకేశ్ పై విమర్శలు గుప్పించారు.

ఈ విషయాన్ని గ్రహించిన లోకేశ్, ఇప్పుడు అమీర్ ఖాన్‌తో సినిమాను పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక తన నెక్స్ట్ వెంచర్‌గా ‘ఖైదీ 2’ని తెరకెక్కించాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు