ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప-2’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ తనదైన స్వాగ్‌తో ఈ సినిమాలో పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించింది.
అయితే, ఈ సినిమా సౌండ్ ఇంకా వినిపిస్తూ ఉంది. తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన సైమా అవార్డ్స్ 2025లో కూడా పుష్ప-2 సత్తా చాటింది. ఈ సినిమా ఏకంగా 5 బెస్ట్ అవార్డులు అందుకుని సైమా అవార్డుల్లో దుమ్ములేపింది. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్, బెస్ట్ డైరెక్టర్ సుకుమార్, బెస్ట్ హీరోయిన్ రష్మిక మందన్నా, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్‌గా శంకర్ బాబు కందుకూరి సైమా అవార్డులను గెలుచుకున్నారు.
ఇక సైమా అవార్డ్స్ వేదికపై పుష్ప-2 టీమ్ తమదైన ‘‘తగ్గేదే లే’’ ఫోజుతో స్వాగ్ చూపెట్టారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే.