బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించిన మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ సెప్టెంబర్ 12న విడుదల కానుంది. దీనికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించగా, నిర్మాతగా సాహు గారపాటి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సాహు గారపాటి మీడియాతో ఈ చిత్ర విశేషాలు పంచుకున్నారు.
ఈ చిత్ర కథ ఎలా ఉండబోతుంది..?
ఇప్పటివరకు వచ్చిన హారర్ కథల కంటే ఇది భిన్నమైన కథ. రేడియో నుంచి వచ్చే వాయిస్ చుట్టూ అద్భుతమైన హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి.
ఈ కథ విన్నప్పుడు మీ ఫీలింగ్..?
కథ విన్నప్పుడు కలిగిన ఎక్సైట్మెంట్, సినిమా చూసిన తర్వాత మరింత పెరిగింది. సినిమా టాప్ టెక్నీషియన్లతో రూపొందించబడింది.
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పాత్ర ఎలా ఉంటుంది..?
సాయి శ్రీనివాస్ కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఈ హారర్ చిత్రంలో ఆయన నటన కొత్తగా కనిపిస్తుంది.
ఈ చిత్ర సంగీతం గురించి..?
అజినీష్ షెడ్యూల్ కుదరకపోవడంతో, చైతన్ భరత్ మ్యూజిక్ అందించాడు. రీరికార్డింగ్ అద్భుతంగా వచ్చింది.
హీరోయిన్ అనుపమ గురించి..?
ఆమెకు ఇది పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్. కథ వినగానే వెంటనే ఒప్పుకుంది.
ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.?
హాలీవుడ్ స్థాయిలో విజువల్స్, మ్యూజిక్ ఉంటాయి. థ్రిల్‌తో పాటు షాక్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువగా ఉండటంతో ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది.