బుక్ మై షోలో ‘మిరాయ్’ దూకుడు.. అప్పుడే ఆ మార్క్..!

బుక్ మై షోలో ‘మిరాయ్’ దూకుడు.. అప్పుడే ఆ మార్క్..!

Published on Sep 6, 2025 7:00 PM IST

యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న ది మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రం ‘మిరాయ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తుండగా తేజ సజ్జా ఓ సూపర్ యోధుడిగా కనిపిస్తాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో, ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా కోసం 100K+ ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నట్లు బుక్ మై షో ఇంట్రెస్ట్‌లు తెలుపుతున్నాయి. ఇక ఈ సినిమాలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై బజ్ భారీగా ఏర్పడింది.

రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు గౌర హరి సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు