స్టార్ హీరోయిన్ సమంత వరుస విజయాలతో తన కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తోంది. అయితే సమంత – శర్వానంద్ కాంబినేషన్ లో రేపు రాబోతున్న చిత్రం ‘జాను’. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. కాగా ఈ సంధర్భంగా సమంత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ కి సంబంధించి.. ఆసక్తికరమైన వ్యాఖలు చేశారు.
సమంత మాట్లాడుతూ.. ‘నేను నా వివాహం తరువాత కూడా వరుస సినిమాలు చేస్తున్నాను. అయితే నా కుటుంబం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను రెండు మూడు సంవత్సరాలు కన్నా ఎక్కువ నటించకపోవచ్చు’ అని సమంత చెప్పారు. అయితే, తన నుండి రాబోయే ప్రాజెక్టులన్ని తన కెరీర్ లో చాలా కాలం పాటు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని సమంత తెలిపారు.