ఏ రంగంలో అయినా నంబర్ వన్ స్థానంలో కొనసాగటం అనుకున్నంత సులభం కాదు. గ్లామర్ ప్రపంచంలో అయితే మరీ కష్టం. ఒకసారి అగ్ర స్థానం దక్కిన తరువాత ఆ పొజిషన్ కాపాడుకోవటం కోసం ఎంతో కష్టపడాలి. ఈ విషయం తమన్నకి బాగా తెలుసు. తను నటిస్తున్న సినిమాల కోసం ఆమె ఎన్నో సార్లు రాజీ పడింది. ఈ షూటింగుల వల్ల తన కుటుంభ సభ్యులతో కూడా సరదాగా సమయం గడపలేకపోతున్నాను అంటుంది. కానీ నచ్చిన పనిలో ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఇష్టంగానే భరిస్తాను అంటుంది ఈ ముద్దు గుమ్మ. ఇటీవల కుటుంబ సభ్యులతో సరదాగా గడపడానికి అమెరికా వెళ్ళిన తమన్నకి రెబెల్ షూటింగ్ కోసం వెంటనే బ్యాంకాక్ రావాలని అడిగారట. వారి అభ్యర్ధనని కూడా ఆమె కాదనలేక బ్యాంకాక్ వెళ్లి షూటింగులో పాల్గొంది. ప్రస్తుతం తమన్నా పవన్ కళ్యాణ్ సరసన ‘కెమెరామన్ గంగతో రాంబాబు’, ప్రభాస్ సరసన ‘రెబల్’ సినిమాల్లో నటిస్తుంది.