నేను కలలోనే జీవిస్తున్నానంటున్న మలయాళీ గుమ్మ

నేను కలలోనే జీవిస్తున్నానంటున్న మలయాళీ గుమ్మ

Published on Nov 25, 2012 2:23 PM IST


‘లవ్ ఫెయిల్యూర్’ సినిమా ద్వారా తెలుగులో హిట్ కొట్టిన మలయాళీ ముద్దుగుమ్మ అమలా పాల్. ఆ తర్వాత వరుస క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటున్న అమలా పాల్ ప్రస్తుతం తెలుగు, తమిళం మరియు మలయాళంలో సినిమాలు చేస్తూ బిజీగా బిజీగా ఉంది. ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు కలలు కంటారా? మీరు ఎక్కువగా కనే కల ఏంటి అని అడగగా దానికి అమలా సమాధనమిస్తూ ‘ కలలు కనడం ఏంటి నేను జీవిస్తున్నదే కలలో, అసలు నేనెప్పుడూ ఊహించని లైఫ్ ని ఇప్పుడు గడుపుతున్నాను. అంతా కలలా ఉంది ఇది నిజం అని నమ్మలేకపోతున్నానని’ అన్నారు. ప్రస్తుతం అమలా పాల్ రామ్ చరణ్ తో ‘నాయక్’, అల్లు అర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో’ మరియు నాని సరసన ‘ జెండా పై కపి రాజు’ సినిమాల్లో నటిస్తోంది.

తాజా వార్తలు