హాట్ ఫోటోషూట్ లతో అవకాశాలు రావు : కాజల్


ఈ రోజుల్లో సంప్రదాయ బద్దంగా ఉంటే అవకశాలు దక్కడం లేదు. ఎంత మోడర్న్ గా ఉండి అంత అందాల్ని ఆరబోస్తే అన్ని అవకశాలు దక్కుతున్నాయి. నేటి హీరోయిన్లు కూడా ఈ సూత్రాన్నే ఫాలో అవుతున్నారు. హాట్ ఫోటోషూట్లు చేసి భారీగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. కాజల్ అగర్వాల్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఆలోచిస్తుంది. హాట్ ఫోటోషూట్ లతో ప్రతిభని ఎలా గుర్తిస్తారు అంటుంది. నటనని బట్టి అవకాశాలు దక్కుతాయి. నటనతో పాటు పాత్రకు తగినట్లుగా సంప్రదాయబద్ధంగా, మోడర్న్ గా కనిపిస్తాను అంటుంది. ఆ మధ్య బాలీవుడ్లో అజయ్ దేవగన్ సరసన చేసిన సింఘం సినిమాలో అందాల అరబోయ్యకుండా తనదైన స్టైల్లో కనిపించింది. దర్శకుడు నా పాత్రకు అనుగుణంగా అందాల ఆరబోత చేయమంటే చేస్తాను అంటుంది.

కాజల్ ప్రస్తుతం భారీ షెడ్యూల్స్ తో బిజీ బిజీగా ఉంది. తెలుగులో సుకుమార్ డైరెక్షన్లో మహేష్ బాబు సరసన ఒక సినిమా, శ్రీను వైట్ల డైరెక్షన్లో ఎన్టీఆర్ తో ‘బాద్షా’, వివి వినాయక్ డైరెక్షన్లో ‘నాయక్’, రవితేజతో ‘సారోస్తారు’ సినిమాలు చేస్తుంది. ఇవి కాకుండా తమిళ్లో సూర్య సరసన చేసిన ‘మాట్రాన్’, విజయ్ సరసన ‘తుపాకి’ సినిమాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి. బాలీవుడ్లో అక్షి కుమార్ తో ‘స్పెషల్ చబ్బిస్’ అనే సినిమా కూడా చేస్తుంది.

Exit mobile version