న్యూ ఇయర్ కోసం టాలీవుడ్ భామలకు ఫుల్ క్రేజ్

న్యూ ఇయర్ కోసం టాలీవుడ్ భామలకు ఫుల్ క్రేజ్

Published on Dec 1, 2012 2:23 PM IST


2012 చివరికి వచ్చిందో లేదో అప్పుడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. న్యూ ఇయర్ రోజు జరిగే పెద్ద పెద్ద పార్టీలకు అప్పుడే ప్రిపరేషన్ మొదలైంది. చాలా మానేజ్ మెంట్ కంపెనీలు వారి వారి స్పెషల్ ప్లాన్స్ లో బిజీగా ఉన్నారు మరియు వారి పలు ఈవెంట్స్ లో పెర్ఫార్మ్ చేయడానికి టాలీవుడ్ ముద్దుగుమ్మలను సంప్రదిస్తున్నారు. చార్మి, శ్రద్ధ దాస్, మధుశాలిని మరియు కామ్న జత్మలాని లాంటి వారు ఇప్పటికే పలు షోలు చేయడానికి ఒప్పుకున్నారు. వారి ప్రోగ్రామ్స్ సక్సెస్ చేసుకోవడానికి తారలకి భారీ మొత్తం ఇవ్వడానికి కూడా కంపెనీలు వెనకాడటం లేదు. కావున మీరు కూడా మీ అభిమాన తార పెర్ఫార్మ్ ఎక్కడ చేయనుందో తెలుసుకొని అక్కడ న్యూ ఇయర్ ని ఎంజాయ్ చెయ్యండి ఫెండ్స్.

తాజా వార్తలు