హరీష్ శంకర్ మరియు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్ర టైటిల్ ‘జనగణమన’ అని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి నిర్మాత అయిన దిల్ రాజు ఇటీవలే తన రాబోయే చిత్రాల కోసం ‘జనగణమన’ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయడంతో ఈ పుకార్లు ఊపందుకున్నాయి. ఈ వార్తల్ని హరీష్ శంకర్ కొట్టిపారేశారు మరియు నా చిత్రానికి అది టైటిల్ కాదని ఆయన స్టేట్ మెంట్ ఇచ్చారు. ‘గబ్బర్ సింగ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన తర్వాత హరీష్ ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరి చూపులు ఆయన పైనే ఉన్నాయి. ఎన్.టి.ఆర్ సినిమాకి ‘ఎం ఎల్ ఏ(మంచి లక్షణాలున్న అబ్బాయి)’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ‘బాద్షా’ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ బ్యాంకాక్లో జరుగుతోంది. ఈ చిత్రం పూర్తయిన తర్వాత హరీష్ శంకర్ సినిమా ప్రారంభమవుతుంది.