శృతి హాసన్ ఈ మధ్య చాలా ఆనందంగా ఉంది. ఎందుకనుకుంటున్నారా? ఆమె నటించిన ‘గబ్బర్ సింగ్’ ఇటీవలే విడుదలై భారీ విజయం సాధించడం. ఈ సినిమాకు ముందు ఆమె నటించిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయి విజయం సాధించకపోవడంతో ఆమె పై ఐరన్ లెగ్ ముద్ర వేశారు. గబ్బర్ సింగ్ భారీ విజయంతో ఆమె ఆ ముద్రని చెరిపేశారు. దర్శకుడు హరీష్ శంకర్ ని నమ్మానని ఆయన తన పాత్ర మలిచిన తీరు బావుందని ఆమె అన్నారు. పల్లెటూరి అమ్మాయి పాత్రలో పవన్ కళ్యాణ్ తో కలిసి మాస్ డాన్సులు వేయడం మరిచిపోలేని అనుభూతి అని ఆమె అంటున్నారు. ఆమె త్వరలో నితిన్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం.