ఇంటర్వ్యూ: నటుడు విక్రమ్ ప్రభు – ‘ఘాటీ’కి క్రిష్ గారి వల్లే ఓకే చెప్పాను

ghaati-vikram

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ఘాటీ’ కూడా ఒకటి. నటుడు విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా నటించిన ఈ చిత్రానికి విలక్షణ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. మంచి ప్రమోషన్స్ ని కొనసాగుతున్న మేకర్స్ సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.. ఈ నేపథ్యంలో నటుడు విక్రమ్ ప్రభు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. మరి తాను ఎలాంటి విశేషాలు పంచుకున్నారో ఇపుడు చూద్దాం.

ఈ సినిమా చేయడానికి మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి?

డైరెక్టర్ క్రిష్ గారిని చూసి నేను ఈ సినిమాకు ఓకే చెప్పా. ఆయన నన్ను కలిసి కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యా. ఆయన చాలా పాజిటివ్ పర్సన్. చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్న డైరెక్టర్. నాకు కథ చెప్పడానికి ముందు ‘ఘాటీ’ వరల్డ్ ఎలా ఉంటుందో చూపించారు. అలాగే నన్ను ఈ రోల్‌కు ఎందుకు సెలెక్ట్ చేశారో అనే విషయం గురించి అరగంటసేపు చాలా క్లియర్‌గా వివరించారు. హైదరాబాద్‌లో నాకున్న ఫ్యాన్ బేస్ గురించి చెప్పారు. నా గత సినిమాల్లోని చాలా సీన్స్ గురించి చెబుతూ.. నిన్ను దృష్టిలో పెట్టుకునే ‘దేశిరాజు’ క్యారెక్టర్ రాశానని చెప్పారు. ఆ మాట నాకెంతో సంతోషాన్నిచ్చింది. ఆయనతో మాట్లాడాక సినిమా విషయంలో మా ఇద్దరి అభిప్రాయాలు సేమ్ అని అర్థమైంది. తర్వాత నా క్యారెక్టర్ గురించి ప్రెజెంటేషన్ ఇచ్చి స్టోరీ చెప్పారు.

ఇది మీ ఫస్ట్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ కదా? ఎలా అనిపిస్తోంది?

నేను తెలుగులో చిరంజీవి గారికి, నాగార్జున గారికి పెద్ద ఫ్యాన్‌ని. వాళ్ల సినిమాలు ఎన్నోసార్లు థియేటర్‌లో చూశా. అలాంటి టాలీవుడ్‌లో ఇప్పుడు నేను డైరెక్ట్ సినిమా చేయడం చాలా ఎగ్జైటింగ్‌గా అనిపిస్తోంది.

డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలని ఎప్పుడూ ప్లాన్ చేయలేదా?

తెలుగు సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. కానీ నా లైఫ్‌లో ప్లాన్ ప్రకారం ఏదీ జరగలేదు. నేను డైరెక్టర్ అవుదామనుకుంటే యాక్టర్ అయ్యా. అందుకే నా హార్ట్ ఏం చెబితే అదే చేసుకుంటూ వెళ్తున్నా. అనుష్క గారితో కలిసి నటించే ఛాన్స్ గతంలో ఒకసారి మిస్ అయింది. ‘రుద్రమదేవి’లో అల్లు అర్జున్ గారు చేసిన గోనగన్నారెడ్డి పాత్రను గుణశేఖర్ గారు ఫస్ట్ నాకే చెప్పారు. కానీ అప్పుడు నాకు కుదరలేదు. అల్లు అర్జున్ గారు ఆ పాత్రకు వందశాతం న్యాయం చేశారు.

దర్శకుడు క్రిష్ గారి గురించి చెప్పండి?

క్రిష్ గారి డైరెక్షన్‌లో పని చేయడం నాకు చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. ఆయనతో ఏదైనా ప్రాబ్లం అంటే ఆయన పొయెటిక్‌గా ఉండడమే. సీన్స్ విషయంలో చాలా కాన్పిడెంట్‌గా ఉంటారు. ప్రతి సీన్ కూడా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా తీశారు. అనుష్క గారితో పాటు మిగతా నటీనటులంతా స్క్రిప్ట్‌లో ఉన్నది ఉన్నట్లు చేశారు.

మీ ఫాదర్ ప్రభు గారితో కలిసి మళ్లీ మిమ్మల్ని ఎప్పుడు చూడొచ్చు?

నాన్నగారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని నాకూ ఉంది. కానీ మేమిద్దరం కలిసి స్క్రీన్ మీద కనిపించడం కోసం అవసరం లేకున్నా ఏదో ఇరికించి పెట్టినట్లు కాకుండా నిజంగా కథలో ప్రాముఖ్యం ఉంటే చూసే ప్రేక్షకులకు కూడా ఆనందంగా ఉంటుంది. అలాంటి స్టోరీ వస్తే చేయానికి సిద్ధంగా ఉన్నా.

‘ఘాటీ’లో యాక్షన్ సీన్స్ గురించి చెప్పండి?

యాక్షన్ సీన్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఎంజాయ్ చేస్తూ చేశా. యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో డీఓపీ పాత్ర ఇందులో చాలా కీలకం. డీఓపీ మనోజ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ పర్సన్. మిగతా సినిమాల్లో కంటే ఇందులో ఫైట్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి.

‘దేశిరాజు’ క్యారెక్టర్ మీకు ఏదైనా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది?

నటులకు ప్రతి క్యారెక్టర్ ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఇందులో నా పాత్ర మాట్లాడే భాష ఛాలెంజింగ్‌గా అనిపించింది.

అనుష్క గారితో కలిసి పని చేయడం ఎలా అనిపించింది?

అనుష్క గారికి నేను అభిమానిని. ఆమె పేరుకు తగ్గట్టు నిజంగా ఎంతో స్వీట్ పర్సన్. ఆమె ఎంత స్వీట్ పర్సనో అంతే పవర్‌ఫుల్‌ కూడా. ఆమె తన కళ్లతోనే అన్ని హావభావాలూ పలికించగలరు.

మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ గారి గురించి చెప్పండి?

నటీనటులు ఎంత పర్ఫార్మ్ చేసినా.. డీఓపీ ఎంత అద్భుత దృశ్యాలు చిత్రీకరించినా వాటికి జీవం పోసేది సంగీతమే. అలాంటి అద్భుతమైన సంగీతాన్ని సాగర్ అందించారు. అది మీరు థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు కచ్చితంగా ఫీల్ అవుతారు.

నిర్మాతల గురించి చెప్పండి..

ఈ సినిమా నిర్మాతలతో కలిసి పని చేయడం చాలా కంఫర్ట్ అనిపించింది. రెగ్యులర్ సినిమాలు చేయడం వేరు ఈ సినిమా చేయడం వేరు. ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప ఇలాంటి సినిమాలు చేయడానికి ముందుకు రాలేరు. ఈ విషయం ఎందుకు చెబుతున్నానో సినిమా చూశాక మీకు అర్థమవుతుంది.

Exit mobile version