గోన గన్నారెడ్డి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ బన్నీ కాదు.. మిస్ చేసుకున్న నటుడు ఎవరో కాదు

gona ganna reddy

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇపుడు వరకు కెరీర్ లో చేసిన పలు సాలిడ్ పాత్రలలో అనుష్క శెట్టి నటించిన భారీ చిత్రం “రుద్రమదేవి”లో గోన గన్నారెడ్డి పాత్ర కూడా ఒకటి. మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆ పాత్రకి ప్రాణం పోసి సినిమాకే హైలైట్ గా నిలిచాడు. కానీ అసలు ఆ పాత్రకి మొదటి ఛాయిస్ అల్లు అర్జునే కాదని బయటకి వచ్చింది.

అదే అనుష్క శెట్టితో ఇపుడు జోడిగా నటించిన ప్రముఖ నటుడు విక్రమ్ ప్రభు అప్పుడు గోన గన్నారెడ్డి పాత్రని మిస్ చేసుకున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం అనుష్క శెట్టితో నటించిన ఘాటీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ అసలు విషయాన్ని రివీల్ చేశారు. అప్పుడు గుణశేఖర్ తన కోసం ఈ రోల్ ని తీసుకొచ్చారని కానీ అప్పుడు కుదరకపోవడంతో చేయలేదని కానీ అల్లు అర్జున్ ఆ పాత్రకి పూర్తి న్యాయం చేసారని తెలిపారు.

Exit mobile version