నందమూరి నటసింహం బాలకృష్ణ ఇపుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రమే “అఖండ 2”. దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేస్తున్న ఈ భారీ బడ్జెట్ డివోషనల్ డ్రామా కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా అనుకున్న సమయానికి రావడం లేదని మేకర్స్ రీసెంట్ గానే స్టేట్మెంట్ ఇస్తే లేటెస్ట్ గా సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన మాస్ స్టేట్మెంట్ వైరల్ గా మారింది.
బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై ఏర్పాటు చేసిన ఈవెంట్ లో థమన్ చాలా ఎగ్జైటెడ్ గా మాట్లాడడం జరిగింది. ఇలా ఆ రికార్డు ఈ రికార్డు కాదు అఖండ 2 తో వచ్చి ఇండస్ట్రీ రికార్డ్స్ కొడుతుంది జస్ట్ వెయిట్ చెయ్యండి అంటూ చెప్పాడు. దీనితో బాలయ్య అలాగే అక్కడే ఉన్న బోయపాటి శ్రీను థమన్ కామెంట్స్, కాన్ఫిడెన్స్ చూసి ఎంజాయ్ చేశారు. ఇక అభిమానులు ఈ కామెంట్స్ తో మరింత నమ్మకం ఈ ప్రాజెక్ట్ పట్ల పెట్టుకుంటున్నారు.