కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “కూలీ” దీనితో టాక్ బాలేనప్పటికీ భారీ వసూళ్లు తాను సాధించారు. మరి ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ నుంచి రాబోతున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రమే “జైలర్ 2”. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పట్ల గట్టి హైప్ ఉంది.
మరి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఒకదాన్ని మించి ఒక సాలిడ్ బజ్ అంచనాలు పెంచుతున్నాయి. గత సినిమాలో ఎలాగైతే క్రేజీ కేమియాలు ఉన్నాయో ఈసారి వాటితో పాటుగా మరిన్ని సర్ప్రైజ్ లు ఉన్నట్టు తెలుస్తుంది.
ఇలా బాలీవుడ్ నుంచి ప్రముఖ బ్యూటీ జైలర్ 2 లో కనిపించనున్నట్టు ఇపుడు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ఎవరో కాదు విద్యా బాలన్ అట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారే నిర్మాణం వహిస్తున్నారు.