100 రోజులు పూర్తి చేసుకున్న ‘గబ్బర్ సింగ్’


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్’ గబ్బర్ సింగ్’ చిత్రం ఈ రోజుటితో సక్సెస్ఫుల్ గా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం అందించిన సమాచారం ప్రకారం ‘గబ్బర్ సింగ్’ 65 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. విడుదలైన మొదటి రోజు నుంచే మంచి టాక్ తో, మంచి కలెక్షన్లు రాబట్టుకున్న ఈ చిత్రం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు సాదించిన సినిమాల్లో ఒకటిగా చేరిపోయింది. ఈ చిత్రం హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్’ సినిమాకి రిమేక్ సినిమానే అయినా ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ మన నేటివిటీకి తగ్గట్టు కథలో ఎన్నో మార్పులు చేసారు.

ఈ చిత్రంలో అందాల భామ శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా, అభిమన్యు సింగ్ విలన్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సూపర్బ్ మ్యూజిక్ అందించారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

అఫిసియల్ మీడియా పార్టనర్స్ గా ఈ చిత్ర విజయంలో 123తెలుగు.కామ్ కూడా ఒక భాగం అయినందుకు ఎంతో గర్వంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ‘గబ్బర్ సింగ్’ సినిమా విడుదలకి ఒకరోజు ముందే ప్రత్యేకంగా ఈ చిత్ర రివ్యూని మేము అందించాము. ‘గబ్బర్ సింగ్’ ఇంతటి ఘన విజయం సాదించిన సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మరియు అతని టీంకి 123తెలుగు.కామ్ తరపున హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం.

Exit mobile version