గబ్బర్ సింగ్ సెన్సార్ పూర్తి


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. నిన్ననే ఈ సెన్సార్ కార్యక్రమాలు జరగాల్సి ఉండగా కొన్ని సాంకేతిక సమస్యల వాళ్ళ వాయిదా పడింది. ఈ రోజు ప్రారంభమైన సెన్సార్ పూర్తి అయింది. ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు నిర్మిస్తున్నారు.

Exit mobile version