‘బాలయ్య’ లిస్ట్ లో నాలుగు సినిమాలు !

కరోనా మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా సినీ లోకం మొత్తం స్తంభించిపోయినా బాలయ్య మాత్రం ప్రస్తుతం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను ఒప్పుకుంటూ ముందుకుపోతున్నాడు. తాజాగా బాలయ్య దర్శకుడు శ్రీవాస్ సినిమాని ఫైనల్ చేసుకున్నాడట. అలాగే బి గోపాల్ తో కూడా మరో సినిమా చేయబోతున్నాడు. ‘బాలయ్య – బి గోపాల్’లది సూపర్ హిట్ కాంబినేషన్. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే పూర్తి చేసుకుందట.

కాగా ప్రెజెంట్ ఫామ్ లో ఉన్న టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ ను రాస్తున్నారట. అదేవిధంగా డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – బాలయ్య’ కలయికలో కూడా ఓ సినిమా రానుంది. ప్రస్తుతం పూరి కథ రాస్తోంది బాలయ్య కోసమేనని.. ఇప్పటికే పూరి, బాలయ్యకి కథ వినిపించాడని బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.ఇప్పటికే బాలయ్య – పూరి కాంబినేషన్‌లో ‘పైసా వసూల్’ చిత్రం వచ్చింది.

ఆ సినిమాలో బాలయ్యను చాల కొత్తగా చూపించాడు పూరి. ఇక ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కూడా కలిపి మొత్తానికి బాలయ్య లిస్టులో మొత్తం నాలుగు సినిమాలు ఉన్నాయి. మరి గ్యాప్ లేకుండా ఈ సినిమాలను పూర్తి చేస్తాడట బాలయ్య.

Exit mobile version