మొత్తానికి రెబల్ స్టార్ ల్యాండ్ అయ్యాడు.!

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. వింటేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విదుల్ కాబడిన మోషన్ పోస్టర్ టీజర్ అలాగే మెయిన్ లీడ్ పోస్టర్స్ తో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇటీవలే కొన్ని కితమే మేకర్స్ అంతా ఇటలీ లోని ఒక కీలక షెడ్యూల్ కోసం పయనమైన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ షెడ్యూల్ ను ముగించేసి ఇప్పటికే పూజా భారత్ కు తిరిగి వచ్చేసింది. కాని కాస్త లేట్ గానే డార్లింగ్ వచ్చాడు. మొత్తానికి గత రాత్రి ముంబైలో రెబల్ స్టార్ ల్యాండ్ అయ్యాడు.

ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక కీలక షెడ్యూల్ కంప్లీట్ కావడంతో రాధే శ్యామ్ ముగియనుంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version