మొత్తానికి ‘ది రాజా సాబ్’ టీజర్ పై క్లారిటీ!

మొత్తానికి ‘ది రాజా సాబ్’ టీజర్ పై క్లారిటీ!

Published on May 23, 2025 8:30 PM IST

ప్రస్తుతానికి పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ చిత్రం “ది రాజా సాబ్” కూడా ఒకటి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ముందు టీజర్ పట్ల ఆసక్తి నెలకొంది.

అయితే ఈ మే మిడ్ లోనే ఇది ఉంటుంది అని మారుతీ ఆ మధ్య హింట్ ఇచ్చారు కానీ ఇపుడు వరకు ఎలాంటి అప్డేట్ మళ్ళీ లేదు. ఇక ఫైనల్ గా అసలు టీజర్ ఉందా లేదా అనేది మారుతీ సన్నిహితుడు అలాగే తనకి సహా నిర్మాత కూడా అయినటువంటి మాస్ మూవీ మేకర్స్ నిర్మాత ఎస్ కె ఎన్ లేటెస్ట్ గా క్లారిటీ ఇవ్వడం జరిగింది.

మారుతీతో రీసెంట్ గానే మాట్లాడ్డం జరిగింది అని ప్రస్తుతం రాజా సాబ్ పనుల్లోనే బిజీగా ఉన్నారని రానున్న ఈ రెండు వారాల్లోనే టీజర్ రాబోతుంది అని అసలు విషయం రివీల్ చేశారు. సో డార్లింగ్ ఫ్యాన్స్ ఇంకొక్క రెండు వారాలు ఓపిక పడితే సరిపోతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు